తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు ఆహ్వానం అందుకున్న మంత్రి దయాకర్ రావు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన తన 64వ పుట్టిన రోజు వేడుకలను అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మంత్రి చేత వేదిక మీద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, తదితరులు హాజరయ్యారు. అమెరికాలో ఉన్న మంత్రి ఎర్రబెల్లికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, తదితరులు మంత్రికి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
