తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మూడోసారి నియామకమైన సందర్భంగా మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తీరును నాగేందర్ వివరించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు.
సోషల్ మీడియాలో అబద్ధపు విష ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించాలి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కాసర్లకు సూచించారు. దీంతో పాటు రాష్ట్రానికి వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ తనతో పేర్కొన్నారని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.