Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ పట్టణాలలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లో వినయ్‌ కుమార్‌ చెలుపాటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్‌ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ వేడుకలలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా కోర్‌ కమిటీ నాయకులు సునీల్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీకాంత్‌, విష్ణు, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News