Skip to main content

Namaste NRI

లండన్‌ పర్యటనలో మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన

లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. లండన్ స్ట్రాట్ ఫోర్డ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. 2012 లో ఒలింపిక్ గేమ్స్ కోసం నిర్మించిన పార్క్ లోని పలు క్రీడా పార్కులు పరిశీలించిన మంత్రి నారాయణ బృందం లండన్ స్టేడియం,లండన్ ఆక్వాటిక్స్ సెంటర్, హైడ్ పార్క్, లీ వ్యాలీ వేలోపార్క్ ల నిర్మాణాలు అధ్యయనం చేశారు.

ఒలింపిక్స్ ప్రధాన క్రీడలైన ఫుట్ బాల్,రగ్బీ, బేస్ బాల్ గేమ్స్ నిర్వహించిన లండన్ స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఆయా స్టేడియంలు పరిశీలించారు. ఈ బృందంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్‌లు ఉన్నారు. రెండు రోజుల లండన్ పర్యటనముగించుకుని మంత్రి నారాయణ బృందం ఖతార్ బయలుదేరి వెళ్లారు.


Social Share Spread Message

Latest News