సింగపూర్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 1న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను భారతీయ సంతతికి చెందిన మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం దక్కించుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతా సర్టిఫికెట్లను జారీచేసినట్లు ఎన్నికల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హతా సర్టిఫికెట్ల దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో సింగపూర్ అధ్యక్ష ఎన్నికల కమిటీకి(పిఇసి) మొత్తం ఆరు దరఖాస్తులు అందాయి. వీరిలో మాజీ మంత్రి 66 ఏళ్ల ధర్మాన్‌తోపాటు మాజీ సిఐసి ఇన్వెస్ట్‌మెంట్ అధిపతి ఎంగ్ కోక్ సంగ్(75), మాజీ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇన్‌మ్ చీఫ్ టాన్ కిన్ లియాన్(75)లను ఎన్నికల్లో పోటీకి అర్హులుగా పిఇసి ప్రకటించింది. అర్హత సాధించిన ముగ్గురు వ్యక్తులు నిజాయితీపరుని, మంచి వ్యక్తిత్వం గల వారని, పేరు ప్రఖ్యాతలు ఉన్నవారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లీ జూ యాంగ్, ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన పిఇసి తెలిపింది.