Namaste NRI

టాక్‌ బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో టాక్‌ లండన్‌ బోనాల జాతర పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  తన నివాసంలో ఆవిష్కరించారు. జులై 3న లండన్‌లో బోనాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న టాక్‌ సంస్థను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ కడుదుల మాట్లాడుతూ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించినట్టు తెలిపారు. టాక్‌ సంస్థను ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు రత్నాకర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్‌ వ్యవస్థాపకుడు అనిల్‌ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్‌ కుమార్‌ శానబోయిన, శ్రీనివాస్‌ వల్లాల, విద్యార్థి నాయకుడు ప్రమోద్‌ కక్కెర్ల పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events