Namaste NRI

మిరాయ్  ఒక విజువల్‌ వండర్‌ :  నిర్మాత విశ్వప్రసాద్‌

హీరో తేజ సజ్జా మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌-ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ వైజాగ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ  మిరాయ్  ఒక విజువల్‌ వండర్‌. అద్భుతమైన లొకేషన్స్‌, ఆర్ట్‌ వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా డెఫినెట్‌గా పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. మిరాయ్ పాన్‌ వరల్డ్‌ ఫ్రాంచైజ్‌ అవుతుంది. హను మాన్‌ తర్వాత తేజ ఈ సినిమా కోసం చాలా డెడికేటెడ్‌గా వర్క్‌ చేశారు. మనోజ్‌ ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపి స్తారు. హరి గౌర అత్యద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో హిస్టరీ, సూపర్‌ నేచురల్‌ పవర్‌, స్పిరిచువల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


హీరో తేజ మాట్లాడుతూ  ఇది ఒక యాక్షన్‌ ఫాంటసీ అడ్వెంచర్‌. మీ కోసం ఒక వరల్డ్‌ని ప్రిపేర్‌ చేసి ఉంచాము. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చే సినిమాని తీసుకొస్తున్నాం. నేను చూసిన వన్‌ అఫ్‌ ది బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ విశ్వప్రసాద్‌. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ప్యాషన్‌ ఉండాలి. డైరెక్టర్‌ కార్తీక్‌ ఎంత అద్భుతమైన సినిమా ఇచ్చారో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. పైరసీని ఎవరు ఎంకరేజ్‌ చేయొద్దు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్స్‌ రేట్స్‌తో మీరు సినిమా చూడబోతున్నారు. చాలా తక్కువ ధరకే థియేటర్స్‌లో చూడబోతున్నారు. టికెట్స్‌లో ఎలాంటి పెంపు లేదు అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events