Namaste NRI

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి బ్లాస్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క కలిసి నటించిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాస్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో తొలుత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రిలీజ్‌ డేట్‌ కరెక్టేనా అని చాలాసార్లు అనుకున్నాం. అయితే మా టెన్షన్స్‌ అన్నింటిని పటాపంచలు చేస్తూ విడుదలైన అన్ని కేంద్రాల్లో చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నది అని అన్నారు.  మౌత్‌టాక్‌తోనే ఈ సినిమా ఇంతటి విజయం సాధించింది. ఈ పాయింట్‌ను ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో అనుకున్నాం. మెగాస్టార్‌ చిరంజీవిగారు ఈ సినిమా చూసి మాతో రెండు గంటలు మాట్లాడారు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఫలితం వచ్చింది అన్నారు. ఈ సినిమా ప్రయాణంలో తనకు అందరూ అండగా నిలిచారని చిత్ర దర్శకుడు మహేష్‌బాబు చెప్పారు. 

డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ  నేను మిగతా వాళ్ల సినిమా ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తుంటా కానీ నవీన్ సినిమాలకు మాత్రం ఒక ఫ్యాన్ గా వస్తుంటా. ఆయన పర్ ఫార్మెన్స్ అంటే నాకు అంత ఇష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  చూశాను. బ్యూటిఫుల్ మూవీ. యూవీ క్రియేషన్స్ వాళ్లు ఒక సినిమాను నిర్మించే విధానం, ఆ ప్రాజెక్ట్ మీద వారికి ఉన్న డెడికేషన్ అద్భుతం. ఈ మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్కేఎన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events