నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి, లేడీ లక్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇలాంటి ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి. అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రీమియర్ షోను ఆడియెన్స్‌తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో ఈ యంగ్ హీరో పర్యటిస్తారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధవుతోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)