ఈ ఏడాది ప్రపంచ సుందరి పోటీలు ఇజ్రాయెల్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్నది 70వ ఎడిషన్ పోటీ కాగా, అది డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లోని రిసార్ట్ నగరం ఎలియాత్‌లో జరుగుతుందని మిస్ యూనివర్క్ సంస్థ వెల్లడిరచింది. మూడు గంటలపాటు సాగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ సుందరిగా ఉన్న మెక్సికో దేశస్తురాలు ఆండ్రియా మెజా కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని బహుకరిస్తారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకోవలని తద్వారా మిస్ యూనివర్స్ 70వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.