అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టేక్. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్. ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. చాలా రంగాల్లో సర్దార్ విజయం సాధించాడు. సినిమాల్లో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా వచ్చాడు. ఈ సినిమా మీద సర్దార్ కి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. విలన్ గా నాకు పోటీ వచ్చిన పర్లేదు. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చిన్న తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే సరికొత్త పంథాలో ఉంటుంది అన్నారు. హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ కథపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటుడిగా నాకు సరికొత్త గుర్తింపును తీసుకొస్తుంది. కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి అన్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో ఆర్‌పీ పట్నాయక్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

