విజయనిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం మిస్టర్ కింగ్. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. బి.ఎన్.రావు నిర్మాత. నిష్కల, ఉర్వీ సింగ్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ విభిన్నమైన కథ ఇది. నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. మణిశర్మ చక్కటి స్వరాల్ని అందించారు. ఇటీవల విడుదల చేసిన నేనెరుగని దారేదో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తవాడైనా శరణ్‌కుమార్ మంచి నటనను కనబరిచాడు అని చెప్పారు. వినూత్న కథ ద్వారా హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శరణ్ కుమార్ అన్నారు. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడలేదని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచమవుతున్న తన కుమారుడిని ప్రేక్షకులు ఆదరించారని శరణ్ కుమార్ తండ్రి రాజ్‌కుమార్ కోరారు. నటులు రోషన్, ఐ డ్రీమ్స్ అంజలి, డీవోపీ తన్వీర్ తదితరులు పాల్గొన్నారు.
