ఒడిశాకు చెందిన బీజద్ అనే నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు అంగద్ కన్హార్. ఆయనకు 57 సంవత్సరాలు. కందమాల్ జిల్లా ఫుల్బాణి మండలం పితాబరి గ్రామంలోని రుజంగి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఆయన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇతర విద్యార్థులతో కూర్చొని పదో తరగతి పరీక్షలు రాశారు. 40 ఏళ్ల క్రితం ఆయన డ్రాపవుట్. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాశారు. కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత కారణాల రీత్యా తాను చదువు మానేశానని ఎమ్మెల్యే అంగద్ పేర్కొన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ సాధారణ విద్యార్థిగా పదో తరగతి పరీక్షలు రాశానని చెప్పుకొచ్చారు. 50 ఏళ్ల పైబడిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకే నేను పదో తరగతి పరీక్షలు రాయాలని ఫిక్స్ అయ్యా. పరీక్షలు రాయడానికి గానీ, చదువుకోడానికి గానీ వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదని అని ఆయన స్పష్టం చేశారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్షకు రాగా, వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)