Skip to main content

Namaste NRI

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. కువైట్‌ అధక్షురాలు అభిలాష గొడిశాల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ  కవిత అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పండుగను విశ్యవ్యాప్తం చేయడంలో ఆమె ఎంతో శ్రమించారని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేయడంతో పాటు మరెన్నో విషయాల్లో మా మహిళలందరికి కవిత స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, రవి సుధగాని,  ప్రమోద్ కుమార్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News