వచ్చే వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. 21 నుండి 27 వరకు జరగనున్న వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వందమందికి పైగా దేశ, ప్రభుత్వాధినేతలు న్యూయార్క్ చేరుకోనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్‌లో మోదీ ప్రపంచ నేతలనుద్దేశించి మాట్లాడతారు. అంతకుముందు రోజు 24న బైడెన్ అతిథ్యమిచ్చే క్యాడ్ నేతల సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగాలు కూడా ఈ సమావేశంలో పాల్గొని గత ఆరుమాసాల్లో జరిగిన పురోగతిని సమీక్షిస్తారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంశాలను కూడా చర్చిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.