Namaste NRI

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం

భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన ఈ కార్య్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ప్రధాని గా మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్‌ సభ్య దేశాల ప్రతినిధులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, మారిషస్ ప్రవీంద్ కుమార్, ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు మహ్మద మొయిజ్జు సహా మొత్తం ఏడు దేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నటులు షారుక్‌ ఖాన్‌, రజినీకాంత్‌, ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events