నేపాల్ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రధాన మంత్రిగా నియమితులైన ఓలీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందు కు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మూడోసారి నియమితులయ్యారు. నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్‌సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
