త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్ ప్రత్యేకంగా మోదీజీ థాలీ పేరుతో ఓ థాలీని తయారు చేసింది. దీని యజమాని, ప్రముఖ చెఫ్ శ్రీపాద్ కుల్‌కర్ణి దీనిని తయారు చేశారు. దీనిలో కిచిడి, రసగుల్లా, సర్సోన్ కా సాగ్, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్, మరికొన్ని ఇతర తినుబండారాలు ఉన్నాయి.శ్రీపాద్ కుల్‌కర్ణి మాట్లాడుతూ భారతీయ మూలాలుగలవారి కోరిక మేరకు ఈ థాలీని తయారు చేసినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గౌరవార్థం మరో థాలీని తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఇండియన్ అమెరికన్ల మనసులో జైశంకర్ రాక్‌స్టార్ అన్నారు. దీనికి ‘డాక్టర్ జైశంకర్ థాలీ’ అని పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మోదీజీ థాలీని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీనికి మంచి ప్రజాదరణ లభిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
చూడగానే నోరూరిపోయే విధంగా మోదీజీ థాలీ ఉంది. దీనిలోని పదార్థాలు వర్ణరంజితంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కిచిడి, రసగుల్లా, సర్సోన్ కా సాగ్, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్, మరికొన్ని ఇతర తినుబండారాలు ఉన్నాయి. వీటిలో దేనిని ముందు తినాలో తెలియనంత ఆత్రుత కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. మోదీకి ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. మోదీ గౌరవార్థం వీరు విందు ఇవ్వబోతున్నారు.