రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్ ఇమ్మాన్యయేల్ మాక్రాన్ ప్రశంసించారు. ఈ మేరకు మాక్రాన్ న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశంలో మోదీ సందేశాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ పుతిన్‌కి ఇచ్చిన సందేశం సరైనదని అన్నారు. ఔను ఇది యుద్దానికి సరైన సమయం కాదు అని మోదీ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదుర్కొనే సమయం అని పుతిన్‌కు మోదీ హితువు పలికారు. ఆ విషయాలను గురించి మాక్రాన్ మాట్లాడుతూ మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)