ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌజ్ విందులో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌజ్ అధికారి విందు సందర్భంగా కలిసిపోతున్న రెండు దేశాల ప్రజలను ఆయన అభినందించారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటునాటు కు అమెరికన్లు డ్యాన్స్‌లు చేస్తున్నారని, అలాడే హాలోవీన్ సందర్భంగా భారతీయ చిన్నారులు స్పైడర్‌మ్యాన్‌గా మారుతున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. వైట్‌హౌజ్ విందులో ప్రధాని మోదీ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.
రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. ప్రతినిత్యం వారు ఒకరినొకరు బాగా తెలుసుకుంటున్నారని తెలిపారు. అధికారిక విందులో జో బైడెన్ పక్కన నిలబడి ఐకానిక్ హీరో క్యారెక్టర్ స్పైడర్‌మ్యాన్, ఎస్.ఎస్. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటునాటు పాటను ప్రేక్షకుల నవ్వుల మధ్య వినిపించారు. రోజులు గడిచే కొద్దీ భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు బాగా అర్థం తెలుసుకుంటున్నారని మోదీ అన్నారు.