షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే ఆ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వర్చుల్ విధానంలో మాట్లాడనున్నారు. చైనా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు బీజింగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీజిన్‌పింగ్ మాట్లాడుతారని తెలిపారు. జూలై 4వ తేదీన ఎస్‌సీవో మీటింగ్ జరగనున్నది. ఆ సమావేశాల్లో జిన్‌పింగ్ కీలకమైన సందేశం ఇస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యుంగ్ తెలిపారు. ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఎస్సీవో మీటింగ్‌లో జీ జిన్‌పింగ్ పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.