Skip to main content

Namaste NRI

మోదీ మాటతో మా సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది .. వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్!

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్.బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ఇటీవల ప్రధాని మోదీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం అని అన్నారు. ఈరోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందులో చిన్న సినిమా అంటే ఇంకా రిస్క్ ఉంటుంది. అయితే ఈ సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా క్వాలిటీతో తీశారు. మోదీజీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ప్రోత్సహించారు. ఆయన మాట ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. డైరెక్టర్ మధు ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇది యూత్ సినిమా, సమ్మర్ సినిమా అని డిస్ట్రిబ్యూటర్ రాందాస్ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events