Skip to main content

Namaste NRI

ఐరాసలో మోదీ యోగా..గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో ఈ రికార్డు నమోదైంది. ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News