
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రలు పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 25న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే నేడు మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. సినిమా నుంచి మోహన్ బాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమైంది. గ్లింప్స్‌లో ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ, ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ అంటూ సాగే లిరికల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అందులో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా పవర్ ఫుల్ లుక్కులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ గ్లింప్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ సినిమా ని సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లతో సినిమాను ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించేలా రూపొందిస్తున్నారు. ఆధ్యాత్మికత, భక్తి, సాహసం కలబోసిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
