మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపివేస్తున్నది. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపు లతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నటుడు మోహన్‌లాల్ ఓ కీలక నిర్ణయం తీసుకు న్నారు. అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కీలక వ్యక్తులపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం ఈ సంఘటన మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కమిటీలోని కొంతమంది సభ్యుల పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో వారందరూ రాజీనామా చేసినట్లు తెలిసింది. రెండు నెల ల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అమ్మ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజార మూడులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.