స్పెయిన్‌లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. ఆఫ్రికాలో ఈ వైరస్ వెలుగు చూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్ సంబంధిత మరణం నమోదయింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఆఫ్రికా బయట, ఐరోపాలో నమోదైన మంకీపాక్స్ మరణం ఇదే మొదటిది కావడం విశేషం. స్పెయిన్‌లో ఇప్పటివరకు 4298 మందికి మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. ఇందులో 120 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. అతనికి బ్రెజిల్‌లో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)