నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.కాజల్ అగర్వాల్ కథానాయిక.సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతు న్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 01న గణేష్ అంథెమ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక థమన్ కంపోజిషన్‌లో రానున్న ఈ సాంగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
