అమెరికా, రష్యా, చైనా, జపాన్, బ్రెజిల్, పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్లోనే పెట్రోల్ ధర ఎక్కువ అని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో తేలింది. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్ రీసెర్చి నివేదిక పేర్కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా 106 దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. తలసరి ఆదాయంతో పోలిస్తే వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, వెనిజులా దేశాల కంటే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న దేశాల్లో తలసరి ఆదాయం కూడా ఎక్కువ. కానీ భారత్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)