Namaste NRI

డిసెంబర్ 22 న మోస్ట్ వాంటెడ్ కరీంనగర్ కుర్రాళ్లు

పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామాగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌ కరీంనగర్స్‌-మోస్ట్‌ వాంటెడ్‌.  బాలాజీ భువనగిరి దర్శకత్వం డిసెంబర్‌ 22న ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ ట్రైలర్‌, కరీంనగర్‌ వాలే అంటూ సాగే పాట ప్రస్తుతం బాగా వైరల్‌ అవుతున్నాయని మేకర్స్‌ సంతోషం వెలిబుచ్చారు. కరీంనగర్‌కి చెందిన నలుగురు కుర్రాళ్ల జీవితాలని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ, కథను చూచాయగా తెలియజేస్తూ కట్‌చేసిన ట్రైలర్‌ యువతను కట్టిపడేస్తున్నవని మేకర్స్‌ చెప్పారు.  ఇందులోని యాక్షన్‌ డ్రామా, కథలోని భావోద్వేగాలు మనసుకు హత్తుకుంటాయని, నూతన నటులు అమన్‌ సూరేపల్లి, సాయి సూరేపల్లి, అనిరుథ్‌ తుకుంట్ల సహజత్వంతో నటించారని, సాకేంతికంగా ఈ సిరీస్‌ అందరికీ నచ్చేలా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సిరీస్‌కి రచన: రమేశ్‌ ఎలిగేటి, కెమెరా: సంకీర్త్‌ రాహుల్‌, సంగీతం: సాహిత్యసాగర్‌, నిర్మాణం: స్ట్రీట్‌ బీట్జ్‌ సినిమా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events