
బ్రూనైలోని బెలైట్‌లో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బెలైట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాతృమూర్తులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమాన్ని ఉమామహేశ్వరి సమన్వయం చేశారు. ఈ వేడుకల్లో తల్లులు, పిల్లలు మ్యాచింగ్ డ్రెస్‌ల్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిల్లలతో కలిసి తల్లులు ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. ఈ సందర్బంగా మాతృమూర్తులకు, పిల్లలకు మధ్య నిర్వహించిన పోటీలు అలరించాయి. ఆ తర్వాత అమ్మ ప్రేమను పాటల రూపంలో పిల్లల తెలియజేశారు. ఆద్యంతం ఈ వేడుక మాతృత్వపు గొప్పదనాన్ని చాటడమే కాకుండా, బెలైట్‌లోని తెలుగు కమ్యూనిటీ సాంస్కవృతిక స్ఫూర్తిని ప్రతిబింబించింది. ఈ సందర్భంగా అతిథులకు రుచికరమైన వంటకాలను వడ్డించారు. ఈ కార్యక్రమం చివర్లో అందరికీ మసాలా టీని అందించారు.



