Namaste NRI

మిస్టర్ బచ్చన్ మెలోడీ డ్యూయెట్ సాంగ్… కాశ్మీరు లోయలో

రవితేజ నటిస్తున్న చిత్రం మిస్టర్‌ బచ్చన్‌.  భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రానికి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 90శాతం పూర్తయిందని మేకర్స్‌ తెలిపారు. అందమైన కాశ్మీర్‌వ్యాలీలో గత నాలుగు రోజులుగా రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై బ్యూటిఫుల్‌ మెలొడీ సాంగ్‌ని దర్శకుడు హరీశ్‌శంకర్‌ చిత్రీకరిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు నృత్యరీతుల్ని సమకూరుస్తు న్నారు.

ఈ ఆదివారంతో ఈ పాట చిత్రీకరణ పూర్తయినట్టేననీ, సాహిత్యపరంగానేకాక, కనువిందైన భావోద్వేగాలతో ఈ పాటను తీర్చిదిద్దడం జరిగిందని, మిగతా షూటింగ్‌ని పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. జగబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌ అండ్‌ టీ.సిరీస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events