రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్‌ను విడుదల చేశారు. బొమ్మ సోకులో బొంబాయి జాతరే.. తెలుగు, తమిళ, హిందీ.. వలపు జుగల్ బందీ అంటూ మాస్ బీట్‌తో ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు.
అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. నాయకానాయికలు రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తనదైన శైలి కామెడీ టచ్‌తో దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్.