Namaste NRI

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్టర్ కింగ్

 విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్ కింగ్. యశ్విక నిష్కల, ఉర్వీ సింగ్ కథానాయికలు. శశిధర్ చావలి దర్శకుడు. మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శరణ్ కుమార్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా. సీనియర్ నటీనటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మంచి చిత్రమవుతుందని ఆశిస్తున్నా. అన్నారు. దర్శకుడు శశిధర్ చావలి మాట్లాడుతూ ఆత్మగౌరవం ఉన్న ఓ అబ్బాయి కథ ఇది. నాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల ఈ సినిమాను పలువురికి చూపించాం. అందరూ బాగుందని ప్రశంసించారు.  క్లెమాక్స్ గుర్తుండిపోయేలా ఉంటుంది అన్నారు.  యశ్విక నిష్కల మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మీ అందరి ప్రోత్సాహం కావాలి అన్నారు. ఊర్వీ సింగ్ మాట్లాడుతూ మంచి టీం తో కలసి పనిచేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందరికీనచ్చుతుందని ఆశిస్తున్నాను.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : తన్వీర్, సంగీతం : మణిశర్మ. ఈ నెల 24న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events