ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రేమికుడు. తమిళ చిత్రం చార్లీ చాప్లిన్`2కు అనువాదమిది. ఇటీవలే తమిళనాట విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. వేశ్య కారాణంగా ఓ ప్రేమికుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడనేది ఆద్యంతం నవ్వులను పంచుతుంది. ప్రభుదేవా నటన, డ్యాన్సులు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. పంపిణీదారులుగా మంచి పేరుతెచ్చుకున్న శ్రీనివాసరావు, మహేష్ చౌదరి ఈ సినిమా ద్వారా నిర్మాతలుగా విజయాన్ని అందుకోవాలని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 29న విడుదలకానుంది. శక్తి చిదంబరం దర్శకుడు. వి.శ్రీనివాస్‌రావు, గుర్రం మహేష్ చౌదరి నిర్మాతలు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)