నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. సౌత్‌లోని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హప్నే తీసుకొచ్చాయి. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ సంస్థ నిర్మిస్తుంది.