Skip to main content

Namaste NRI

మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ టీజర్‌ లాంచ్‌

త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ, అనీష్‌ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌. మధుదీప్‌ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. సిహెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.బాబ్జీ సమర్పణలో లోటస్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై అరవింద్‌ మండెం నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్‌ మాట్లాడుతూ వ్యవసాయం అవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. నవతరం యువత జీవనశైలిని చూపిస్తూనే వ్యవసాయం గొప్పదనాన్ని ఈ చిత్రంలో చర్చించామన్నారు. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలనే అంశాన్ని చర్చిస్తూ మెసేజ్‌ ఓరియెంటెడ్‌గా సినిమా తీశామని దర్శకుడు మధుదీప్‌ పేర్కొన్నారు. వినోదంతో పాటు అద్భుతమైన సందేశం కలబోసిన చిత్రమిదని నిర్మాత అరవింద్‌ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రకాష్‌ చెరుకూరి, దర్శకత్వం: మధుదీప్‌ చెలికాని.

Social Share Spread Message

Latest News