Skip to main content

Namaste NRI

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మృణాల్‌ ఠాకూర్‌ .. పెద్ది లో స్పెషల్ సాంగ్

మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో మూడు సినిమాలు చేస్తే, వాటిలో రెండు విజయాలను అందుకున్నాయి. త్వరలో ఆమె డెకాయిట్‌ సినిమాతో మరోసారి తెలుగుప్రేక్షకుల్ని పలకరించనున్నది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ఇందులో మృణాల్‌ పాత్ర కూడా సామాన్యంగా ఉండదట. బలమైన భావోద్వేగాలతో ఆమె పాత్రను తీర్చిదిద్దారట దర్శకుడు షానియల్‌ డియో. ఈ పాత్రతో ఆమె కెరీర్‌ మలుపు తిరగడం ఖాయమని ఇన్‌సైడ్‌ టాక్‌.
ఇక బన్నీ, అట్లీ సినిమాల్లోనూ మృణాల్‌ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలావుంటే, తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌ పెద్ది లో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట మృణాల్‌ ఠాకూర్‌. ఈ పాటలో జాన్వీ కపూర్‌ కూడా భాగం కానున్నదట. సినిమాకే ఈ పాట హైలైట్‌ అట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Social Share Spread Message

Latest News