భారతీయ కుబేరుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీర్తి కిరీటంలో మరో మైలురాయిని చేరుకోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ల డాలర్ల కుబేరుల క్లబ్‌లో చేరికకు చేరువలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నికర సంపద 92.6 బిలియన్ డాలర్లని బ్లూంబర్స్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఇటీలవ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు దూసుకెళ్లడంతో ఈ ఏడాది ఆయన సంపద 15 బిలియన్ల డాలర్లకు పైగా పెరిగింది. గత నెల నుంచి రిలయన్స్ షేర్లు 15 శాతానికి పైగా లబ్ధి పొందాయి. ప్రస్తుతం కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 12వ ర్యాంక్. టాప్‌లో అమెజన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్ తదితరులు ఉన్నారు. ఈ నెల 10న జియో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఆవ్కిరించనున్న నేపథ్యంలో ముకేశ్ అంబానీ రిలయన్స్ బిజినెస్ మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.