భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాను పొందిన వ్యక్తి 90 రోజులపాటు దుబాయ్‌లో ఉండొచ్చు. దీనిని మరో 90 రోజులపాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుం ది. మొత్తం మీద ఒక సంవత్సరంలో 180 రోజులకు మించకుండా దుబాయ్‌లో ఉండేందుకు ఇది అనుమతి స్తుంది. దుబాయ్ ఆర్థిక, పర్యాటక శాఖ ఈ వివరాలను వెల్లడించింది. వ్యాపారం, వినోదాత్మక పర్యటనల కోసం ఈ వీసాను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.