మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని ముంబైకి చెందిన అందాల భామ జోయా అఫ్రోజ్ దక్కించుకుంది. గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా పేరుతో జరిగిన ఈ పోటీల్లో జోయా విజేతగా నిలిచింది. మూడేళ్ల వయస్సులోనే బాలనటిగా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించింది. జోయా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంది. వెబ్ సిరీస్‌ల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాధించుకుంది. పాండ్స్, ఏషియన్ పెయింట్స్ వంటి కీలక వ్యాపార సంస్థలకు మోడల్‌గా కూడా ఉంది. 2013లో ఫెమినా మిస్ ఇండియాలో పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచింది. తాజాగా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021 కిరీటాన్ని ముద్దాడిరది. ఈ ఏడాది నవంబర్‌లో జపాన్‌లో నిర్వహించనున్న మిస్ ఇంటర్నేషనల్ 2021 పోటోల్లో మన దేశం తరపున జోయా ప్రాతినిథ్యం వహించనుంది.