Namaste NRI

తానా మహాసభలకు వస్తున్న మురళీ మోహన్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో  జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కళామ్మతల్లి ముద్దు బిడ్డ, సినీనటుడు, నంది పురస్కార గ్రహీత, నిర్మాత, మాజీ లోక్ సభ సభ్యులు, జయభేరీ గ్రూపు అధిపతి మాగంటి మురళీమోహన్‌ గారిని కూడా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు వారు చెప్పారు. తానాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న మురళీ మోహన్‌ పలు తానా మహాసభల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారని, తానాతో ఎంతో సన్నిహిత అనుబంధం ఉన్న ఆయన రాక చాలామందికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు. ఎంతోమంది ప్రముఖులు వస్తున్న ఈ మహాసభలకు అందరూ వచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.మీరు కూడా తానా మహాసభలకు రావాలనుకుంటే వెంటనే మీ పేర్లను రిజిష్టర్‌ చేసుకోండి.

https://tanaconference.org/event-registration.html

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events