Namaste NRI

మురళీ మోహన్‌ లాంచ్‌ చేసిన అంతేనా.. ఇంకేం కావాలి

పవన్‌ కల్యాణ్‌ బయ్యా, రaాన్వీ శర్మ జంటగా నటిస్తున్న చిత్రం అంతేనా ఇంకేం కావాలి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్‌ పతాకంపై నరసింహారాజ్‌ దర్శకత్వంలో రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. ఘర్షణ శ్రీనివాస్‌, సునీల్‌, బ్రహ్మాజీ, సుమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ క్లాప్‌నివ్వగా, దగ్గుబాటి అభిరామ్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. అమ్మకిచ్చిన మాటను, అమ్మాయికిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకున్నాడన్నదే కథాంశం. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చక్కటి వినోదంతో అందరిని అలరిస్తుంది అన్నారు. హీరో పవన్‌ మాట్లాడుతూ ఇంత మంచి కథలో నటించే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. కరాటే కల్యాణి, జాన్వీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్‌.చందర్‌రావు, పాటలు: కాసర్ల శ్యామ్‌, ఆర్ట్‌: భూపతి యాదగిరి, దర్శకుడు, వెంకట నరసింహరాజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events