న్యూజిలాండ్‌లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. డునెడిన్‌లోని హిల్లరీ స్ట్రీట్‌లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్‌గా గుర్తించారు. టెలికాం కంపెనీ కోరస్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన గుర్జిత్ సింగ్‌ను న్యూజిలాండ్ కు పంపేందుకు అతడి తండ్రి నిషాన్ సింగ్ తన గ్రామంలోని భూమిని అమ్మాడు. అయితే ఒక్కగానొక్క కుమారుడు ఆ దేశంలో హత్యకు గురైనట్లు తెలుసుకుని హతాశుడయ్యాడు. న్యూజిలాండ్‌కు చేరుకున్నతండ్రి, కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. తమకు న్యాయం చేయాలని ఆ దేశ పోలీసులను కోరాడు. మరోవైపు గుర్జిత్ సింగ్‌ను హత్య చేసిన 33 ఏళ్ల అనుమానితుడ్ని న్యూజిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు హత్య చేశాడు అన్నదానిపై వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)