అమెరికా నుంచి తమ డిమాండ్లను నెరవేర్చుకునేలా చేసే బాధ్యతను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జోంగ్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆమెను ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించారు. దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచితే అమెరికా వెనక్కు తగ్గుతుందని ఉత్తర కొరియా భావిస్తోంది. విదేశాంగ వ్యవహారాలను కిమ్ యో జోంగ్ సమర్థంగా నిర్వహించగలరని కిమ్ భావిస్తున్నారు. గతంలోనూ అమె అమెరికాతో పలు అంశాల్లో మెరుగైన పనితీరును ప్రదర్శించారు. తమ దేశంలో గతంలో దక్షిణ కొరియా నిర్మించిన ఓ ఆఫీసును జూన్‌లో ఆమె ధ్వంసం చేయించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరపడానికి అమెరికా ఒప్పుకున్న సమయంలో యో జోంగ్ కలగజేసుకుని పలు షరతులు పెట్టారు. ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పారు.
దక్షిణ కొరియాతో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఆపాలని కిమ్ యో జోంగ్ డిమాండ్ చేశారు. అనంతరం తాము దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలు జరుపుతామన్నారు. అంతేగాక, ఇటీవలే ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. యో జోంగ్‌కు ఉత్తర కొరియాలో కిమ్ తరువాత అత్యం శక్తిమంతైన నేతగా దక్షిణ కొరియా గూఢచారి సంస్థ అభివర్ణించింది.