అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి ప్రధాన పాత్రధారులు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకుడు. మహేశ్వ రరెడ్డి గోజల నిర్మాత. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
నటుడు ప్రియదర్శి ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందని అభినవ్ గోమఠం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కథ రాసిన అమ్మాయి శాలినీనే ఇందులో కథానాయికగా నటించడం గొప్ప విషయం. తక్కువ సమయంలో మంచి అవుట్ పుట్ ఇచ్చిన దర్శకుడు సర్వాంగ రియల్లీ గ్రేట్. సాంకేతికంగా కూడా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని నిర్మాత తెలిపారు. తన స్క్రిప్ట్‌నీ, నటననూ నమ్మిన నిర్మాతకు చిత్ర రచయిత, కథానాయిక అయిన శాలినీ కృతజ్ఞత తెలిపింది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులంతా మాట్లాడారు. త్వరలోనే ఓటీటీలో సినిమా విడుదల కానుంది.