శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. రాశి సింగ్ కథానాయిక. పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. ఈ చిత్రానికి మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశి విలేకరులతో మాట్లాడుతూ హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కల. సినిమా లంటే పిచ్చి. అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కల నిజమైనందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను.
మాది రాయపూర్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఏడాది కాలంపాటు ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. సంతోశ్ శోభన్ ప్రేమ్‌కుమార్ ఓటీటీ ఫిల్మ్‌తో హీరోయిన్ అయ్యాను. ఆహాలో పాపం పసివాడు చేశాను. వాటిల్లో నా నటన నచ్చే కథానాయికగా తీసుకున్నారు దర్శకుడు శివ కందుకూరి అని తెలిపారు రాశి. ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. గాళ్ నెక్ట్స్ డోర్ లాంటి పాత్ర. ప్రెస్ రిపోర్టర్‌గా కనిపిస్తాను. కథలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరెక్కించాడు. ైక్లెమాక్స్ని అస్సలు ఊహించలేరు అని చెప్పారు. హైదరాబాద్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రెండూ తనకు చాలా ఇష్టమని, అందుకే ముంబయి నుండి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యానని, తెలుగు కూడా నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చింది.