
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన రిజానా – ఎ కేజ్‌డ్ బర్డ్ అనే హాలీవుడ్ సినిమాలో ఆమె నటించారు. ఈ చిత్రానికి చంద్రన్ రత్నం దర్శకుడు. శ్రీలంకలో ఈ సినిమా చిత్రీకరించబడింది. ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గొప్ప నటుడు జెరెమీ ఐరన్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ సినిమా వల్ల నా కల నెరవేరింది. లయన్ కింగ్ సినిమా లో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. డైలాగులన్నీ గుర్తుండిపోయేంతగా ఆ సినిమా చూశాను. అంతిష్టం నాకు ఆ సినిమా అంటే. రిజానా – ఎ కేజ్‌డ్ బర్డ్ లో నేరుగా ఆయనతోనే కలిసి నటించే గొప్ప అవకాశం వరించింది. శ్రీలంకకే కాదు, ప్రపంచ సినిమాకే కొత్త దారులు చూపించిన దర్శకుడు చంద్రన్ రత్నం. ఆయన డైరెక్షన్‌లో నటించడం గర్వకారణం. నా కెరీర్‌లో మరచిపోలేని మైలురాయి ఇది అని ఆమె పేర్కొన్నారు.
