సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం మా నాన్న సూపర్‌హీరో. అర్ణ కథానాయిక. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. సునీల్ బలుసు నిర్మాత. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా టీజర్ విడుదల చేసిన చిత్రబృందం, గురువారం ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. తండ్రికి కొడుకు రాసే ప్రేమలేఖ లాంటి ఈ పాటలో తండ్రిపై కొడుకుకి ఉన్న ప్రేమాభిమానాలను ఆవిష్కరించడం జరిగిందని మేకర్స్ తెలిపారు.
తండ్రి తనను నెగ్లెక్ట్ చేస్తున్నా, అతనితో సమయం గడిపేందుకు కొడుకు పడే ఆరాటం ఈ పాటలో చూడొచ్చు. లక్ష్మీప్రియాంక భావోద్వేగపూరితమైన సాహిత్యంతో రాసిన ఈ పాటను జై కృష్ణ స్వరపరచగా, నజీరుద్దీన్ ఆలపించారు. రాజుసుందరం కొరియోగ్రఫీ అందించారు. సాయాజీ షిండే, సుధీర్‌బాబు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిచంద్, రాజుసుందరం, శశాంక్, ఆమని ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి.