Skip to main content

Namaste NRI

నటుడిగా నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది : రవితేజ

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఇరుముడి చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. చెన్నైలో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ నాకు తమిళ సినిమాతో చాలా అనుబంధం. నటుడిగా నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది అన్నారు. ఈ సినిమా మీద మొదటి నుంచి నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు. సక్సెస్‌మీట్‌ తమిళనాడులో ఉండాలని కోరుకున్నా. ఇది హార్ట్‌ విన్నింగ్‌ బ్లాక్‌బస్టర్‌. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మనసులో పెట్టుకుంటారు అన్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు ఆడియ

న్స్‌ అద్భుతంగా ఆదరిస్తున్నారని, తమిళంలో కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని, ఇందులోని సందేశం కూడా మెప్పిస్తుందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. తమిళంలో కూడా ఈ సినిమా అద్భుతంగా పర్‌ఫార్మ్‌ చేస్తున్నదని, ఇదో కల్ట్‌క్లాసిక్‌గా నిలిచిపోతుందని, ఇలాంటి కథకు రవితేజ మాత్రమే న్యాయం చేయగలడని నిర్మాత వై. రవిశంకర్‌ పేర్కొన్నారు. కథ విన్నప్పుడే ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఏర్పడిందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కమార్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events