సాయికుమార్, శ్రీనివాస సాయి, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం నాతోనేను. శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. ఈ చిత్రంలోని రెట్రో మెలోడి సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పాట వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రెట్రో స్టైల్‌లో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న శాంతికుమార్ సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో పని చేసిన అందిరికీ మంచి పేరు రావాలి అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-23.jpg)
దర్శకుడు మాట్లాడుతూ ఈ పాటను చూసిన వారికి 1980 కాలంలో వున్నామా అనిపించే విధంగా విజువల్స్ వుంటాయి. మంచి కథతో తొలి ప్రయత్నం చేశాను. తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ వుంటుందనే నమ్మకం వుంది అన్నారు. నిర్మాత ప్రశాంత్ టంగుటూరి మాట్లాడుతూ మంచి కథతో తొలి ప్రయత్నం చేసాం. సాయికుమార్ గారు కొత్తగా కనిపిస్తారు. శ్రీకాంత్‌గారితో చాలాకాంలగా పరిచయం ఉంది. ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా. మా తొలి ప్రయత్నం నాతో నేను చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-23.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-23.jpg)